

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ పూర్వీకుల ఇంటి వద్ద జరిగిన నిరసనకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం, అల్లర్లు, అక్రమ ప్రవేశం తదితర కేసులు నమోదు చేశారు. నిరసన సందర్భంగా కొందరు కార్యకర్తలు ఇంటి గేటు, గోడలపై నల్ల స్ప్రే పెయింట్‌తో నినాదాలు రాసినట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎనిమిది మందిని పేర్లతో పేర్కొనడంతో పాటు మరో 15-20 మంది గుర్తుతెలియని వ్యక్తుల ప్రస్తావన ఉంది.
ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని హత్యాయత్నం, అల్లర్లు, ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం, ప్రభుత్వ ఉద్యోగిపై దాడి లేదా బలప్రయోగం, ఇంట్లోకి అక్రమ ప్రవేశం, బెదిరింపులు వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, పోలీసులపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నిరసనకు సంబంధించిన సెక్షన్లకే కేసును పరిమితం చేయాల్సిందని పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!