

మెగాస్టార్ చిరంజీవి, నయన తార జంటగా అనీల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న భారీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి కే విడుదలైన తొలి పాట ‘మీసాల పిల్ల’ చార్ట్‌బస్టర్ గా నిలిచి హైప్ ను మరింత పెంచింది.
ఈ నేపథ్యంలో రెండో సాంగ్ పై అందరి దృష్టి పడింది. త్వరలోనే ఈ కొత్త పాటను విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. అయితే దీని పై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజా టాక్ ప్రకారం నెక్స్ట్ సాంగ్ గా రొమాంటిక్ డ్యూయెట్ ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వెంకీ మామ–చిరంజీవి పై ఒక పాట కూడా ఉండొచ్చని ప్రచారం జరిగినప్పటికీ, మేకర్స్ ఈసారి కూడా చిరు–నయన్ జంట పై వేసిన డ్యూయెట్ ను ముందుగా విడుదల చేయాలని నిర్ణయించారట. ఈ పాటకు ‘శశిరేఖ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. భీమ్స్ ఈ సాంగ్‌కు ఎలా ట్యూన్ అందించాడన్నది ఇప్పుడే అభిమానుల్లో పెద్ద కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.
షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ భారీ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.




















కామెంట్స్ (1)
చిరు–నయన్ రొమాంటిక్ డ్యూయెట్ కోసం ఫ్యాన్స్ భారీగా వైట్!