

వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృథ్వీ పెరిచెర్ల నిర్మించిన చిత్రం ‘స్కై’. మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 6 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ‘స్కై’ సినిమాలో ఇంటెన్స్ లవ్ స్టోరీ ఉందని, పాటలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. డీవోపీ రసూల్ ఎల్లోర్ విజువల్స్ సినిమాకు ప్రధాన బలమని అన్నారు. నిర్మాత నాగిరెడ్డి గుంటక మాట్లాడుతూ హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో కూడిన కొత్త ప్రేమ కథను ప్రేక్షకులకు అందిస్తున్నామని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ శివ ప్రసాద్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.
డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ షూటింగ్‌కు ముందే పాటలు రెడీ చేయడం వల్ల సినిమా సమయానికి పూర్తయిందన్నారు. హీరో మురళీ కృష్ణంరాజు ఈ చిత్రంతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. హీరోయిన్ శృతి శెట్టి తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని వెల్లడించారు. మొత్తం మీద ‘స్కై’ సినిమా ప్రేమ, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!