

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, దర్శకుడు చెల్లా అయ్యావు కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గట్ట కుస్తీ-2’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ‘గట్ట కుస్తీ’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించారు. రివ్యూలు ఓ మాదిరిగా వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ చిత్రం రూ.50 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ విజయంతో సినిమా ఇండస్ట్రీలో మంచి చర్చనీయాంశంగా మారింది.
సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్ చేస్తూ విష్ణు విశాల్ దర్శకుడు చెల్లా అయ్యావు, నిర్మాతలకు విలాసవంతమైన బహుమతులు అందించారు. గత 11 సంవత్సరాలుగా తన జీవితంలో ప్రతి కష్టంలో, ప్రతి సంతోషంలో తోడుగా నిలిచిన చెల్లా అయ్యావుకు ఎక్స్ వేదికగా ఎమోషనల్ ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు సుమారు రూ.15–20 లక్షల విలువ చేసే టయోటా హైక్రాస్ కారు, 10 గ్రాముల బంగారు గొలుసు, ఒక బ్రేస్‌లెట్‌ను బహుమతిగా ఇచ్చారు. అలాగే నిర్మాత ఇషారి గణేశ్‌కు బీఎండబ్ల్యూ-3 సిరీస్ లగ్జరీ కారును అందజేశారు. సినిమా టీమ్‌లోని నటీనటులు, టెక్నీషియన్లకు 40 గ్రాముల వెండి నాణేలను పంపిణీ చేసినట్లు సమాచారం. టీమ్‌ను ఈ స్థాయిలో గౌరవించిన విష్ణు విశాల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!