
జనరల్

వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్రం నుంచి ‘రాసా గుమ్మడి’ ఫోక్ కార్నివాల్ సాంగ్‌కు గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దక్షా నగార్కర్, రితికా నాయక్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు.
జూలై 19 సాయంత్రం 4 గంటలకు అనంతపురంలోని వి మెగా థియేటర్‌లో ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ‘రాసా గుమ్మడి’ పాట మంచి మాస్ బజ్ తీసుకురానుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!