

తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దానికి పైగా మార్కెటింగ్, డిజిటల్ ప్రచార కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన శరత్ చంద్ర నాయుడు ఇప్పుడు నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయన తొలి నిర్మాణమైన ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్‌సిరీస్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. నిర్మాతగా మాత్రమే కాకుండా, దర్శకుడు వినోద్, రచయితల బృందంతో కలిసి కథా రచనలో కూడా ఆయన కీలక సృజనాత్మక సహకారం అందించారు.
‘రేలంగి మావయ్య’ అనే ఇన్‌స్టాగ్రామ్ పోడ్‌కాస్ట్‌లో పంచుకున్న 90వ దశకపు జ్ఞాపకాలే ఈ వెబ్‌సిరీస్‌కు ప్రేరణగా మారాయని శరత్ చంద్ర తెలిపారు. ఈ ప్రయాణానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా అభినందనలు తెలపడం తనకు మరింత ప్రోత్సాహాన్నిచ్చిందన్నారు. మార్కెటింగ్‌లో సంపాదించిన అనుభవం ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకోవడంలో, మంచి కథలను నిర్మించడంలో ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!