
సినిమాలు

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (టిఎఫ్‌టీడీడీఏ) అధ్యక్షురాలు వి.వి. సుమలత డ్యాన్సర్లకు బకాయి ఉన్న పారితోషికాల సమస్యపై తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధికారికంగా వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే పని పూర్తి చేసిన డ్యాన్సర్లకు చెల్లించాల్సిన పారితోషికాలు ఇంకా అందకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యకు పారదర్శకంగా, న్యాయబద్ధంగా పరిష్కారం చూపేందుకు ఫిల్మ్ చాంబర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో డ్యాన్సర్ల హక్కులు, జీవనోపాధిని పరిరక్షించేలా అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చలు జరిపి సామరస్యపూర్వక పరిష్కారం తీసుకురావాలని ఆమె కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!