

కోలీవుడ్ స్టార్ సూర్య వరుస ఫ్లాపుల తర్వాత కరుప్పుతో భారీ విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా సూర్య 47ను జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడితో వస్తున్న ఈ యాక్షన్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.
జూలై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనితో పాటు 37 సెకన్ల బిహైండ్ ది సీన్స్ వీడియోను విడుదల చేశారు. ఇందులో నజ్రియా నజీమ్, నటుడు నస్లెన్ సందడి చేశారు. అయితే నస్లెన్ లుక్‌ను గోప్యంగా ఉంచారు. మాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ అందించిన ‘ఐ యామ్ ది వన్’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సూర్య ఒక విభిన్న పోలీస్ పాత్రలో కనిపించనుండగా, వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని టాక్.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!