
జనరల్

సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలు అగ్రనటిగా కొనసాగి తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, టెలివిజన్ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తనకు ఇష్టమైన టాలీవుడ్ హీరోల గురించి వెల్లడించింది.
ఆమె మాట్లాడుతూ ప్రస్తుత తరం హీరోల్లో ప్రభాస్, మహేష్ బాబు తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. వారి నటనను తాను ఎంతో అభిమానిస్తానని, వారిద్దరితో కలిసి నటించే అవకాశం వస్తే చాలా సంతోషిస్తానని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. గతంలో దేశముదురులో అల్లు అర్జున్తో కలిసి ప్రత్యేక గీతంలో కనిపించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!