

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే భారీ చర్చకు దారి తీస్తోంది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నైజం థియేట్రికల్ రైట్స్‌కు సంబంధించి సినీ వర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేసేందుకు దిల్ రాజు భారీ ఆఫర్ ఇచ్చారనే వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. దీంతో ఆ ప్రచారానికి తెరపడింది.
అయితే తాజాగా మరోసారి నైజం రైట్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. చిత్రాన్ని నైజాంలో విడుదల చేసే హక్కుల కోసం వారు ఆకర్షణీయమైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఈ ఆఫర్‌పై నిర్మాతలు కూడా సానుకూలంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ చిత్ర బిజినెస్‌పై పరిశ్రమలో మరింత ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!