
జనరల్

రూ.7,500 రీఫండబుల్ ట్యాక్స్ చెల్లిస్తే ఆర్బీఐ నుంచి రూ.1 లక్ష రీఫండ్ వస్తుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ పూర్తిగా నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఈ లేఖకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ముందస్తు చెల్లింపులు లేదా ట్యాక్స్ పేరుతో నగదు రీఫండ్ ఇస్తామని ఆర్బీఐ ఎప్పుడూ ప్రకటించదని కూడా స్పష్టం చేసింది.
ప్రభుత్వ సంస్థల పేర్లు, లోగోలను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని పీఐబీ హెచ్చరించింది. ఇలాంటి సందేశాలను నమ్మి ఎలాంటి చెల్లింపులు చేయవద్దని, అధికారిక వెబ్సైట్ల ద్వారానే సమాచారాన్ని ధృవీకరించుకోవాలని సూచించింది. అనుమానాస్పద సందేశాలు ఎదురైతే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లేదా సంబంధిత అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!