

‘జైలర్ 2’ సినిమా సెట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న 28 ఏళ్ల కార్తికేయన్ చెన్నై సమీపంలోని పనయూర్ ప్రైవేట్ స్టూడియోలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. సినిమా కోసం ఇంటి ఆకారంలో భారీ సెట్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ లీకేజ్ లేదా సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కనత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసి భద్రతా లోపాలు సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కాగా, ఏప్రిల్ 21న చిత్రబృందం షూటింగ్ పూర్తైనట్లు ప్రకటించడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. సెట్ తొలగింపు పనుల సమయంలోనా? లేక రీషూట్ సమయంలోనా? ప్రమాదం జరిగిందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు సన్ పిక్చర్స్ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
‘జైలర్ 2’ గురించి:
2023లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతోంది. తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, యోగి బాబు తమ పాత్రలను కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ మాఫియా నేపథ్యంలో మరింత పవర్‌ఫుల్ కథను దర్శకుడు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం సెప్టెంబర్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!