

‘రామాయణ’ సీరియల్‌లో లక్ష్మణుడిగా గుర్తింపు పొందిన నటుడు సునీల్ లహ్రీ.. ‘జెన్ జీ’, ‘జెన్ ఆల్ఫా’ వంటి పదాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పదాలు తరాల మధ్య అనవసరమైన విభజనను సృష్టిస్తున్నాయని, యువతను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు దూరం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య పదాలు, పోకడలను గుడ్డిగా అనుసరించడాన్ని ఆధునికతగా భావించకూడదని, కాలానుగుణంగా ముందుకు సాగుతూనే సాంస్కృతిక విలువలను కాపాడుకోవడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు.
సంప్రదాయ గురుకుల విద్యా విధానంలోని కొన్ని అంశాలను తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందని సునీల్ లహ్రీ అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో కేవలం విద్యా విషయాలకే పరిమితం కాకుండా క్రమశిక్షణ, విలువలు, పెద్దలను గౌరవించడం, భారతీయ సంస్కృతితో అనుబంధం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆయన వ్యాఖ్యలు ఆధునిక విద్యా విధానం, సాంస్కృతిక గుర్తింపుపై చర్చకు దారితీశాయి. కొందరు ఆయన అభిప్రాయాలను సమర్థిస్తుండగా, మరికొందరు ‘జెన్ జీ’, ‘జెన్ ఆల్ఫా’ అనేవి కేవలం వయసు తరాలను సూచించే సాధారణ పదాలేనని పేర్కొంటున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!