

శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ‘జార్జ్ క్రిష్’ సినిమా పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే చిత్రీకరణ విషయంలో ఎక్కడా ఆలస్యం జరగకుండా వరుస షెడ్యూళ్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ దశతో మొత్తం షూటింగ్ పూర్తికానుందని సమాచారం. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలను కూడా ఇప్పటికే మొదలుపెట్టారు.
ఈ సినిమాలో శర్వానంద్ ఓ జూనియర్ శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. అతడి పాత్ర చుట్టూ నడిచే కథలో ఆసక్తికరమైన సన్నివేశాలతో పాటు వినోదానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. కథానాయికగా మానస వారణాసి నటిస్తుండగా, వీరిద్దరి మధ్య ప్రేమకథ కొత్త తరహాలో సరదాగా సాగనుందని సమాచారం. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. జనవరి 14న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!