

ఆది సాయి కుమార్ కెరీర్లోనే అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాగా ‘శంబాల’ నిలిచింది. ప్రీమియర్ల నుంచే సినిమాకు మంచి టాక్ రావడంతో, డే వన్‌కే రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ షోలు నమోదయ్యాయి. పాజిటివ్ మౌత్ టాక్‌తో షోలు, స్క్రీన్లు వేగంగా పెరిగాయి. లిమిటెడ్ స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు భారీ డిమాండ్‌తో అన్ని ప్రాంతాల్లో ప్రదర్శితమవుతోంది. క్రిస్మస్ సీజన్‌ను పూర్తిగా ఉపయోగించుకుంటూ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.
యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఉన్నాయి. కంటెంట్‌పై నమ్మకంతో రిలీజ్‌కు రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. అక్కడి నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ డే వన్‌కు మరింత బలపడింది. నగరాల్లోని మల్టీప్లెక్స్‌లతో పాటు చిన్న సెంటర్లలోని సింగిల్ స్క్రీన్లలో కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. మంచి ఆక్యుపెన్సీతో ఈ మూవీ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
రెండో రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో స్క్రీన్లు మరింత పెంచారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, రాబోయే రోజుల్లో ‘శంబాల’ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఆది సాయి కుమార్ కష్టానికి తగిన ఫలితం దక్కిందని, సినిమా బ్లాక్ బస్టర్‌గా మారుతుందని ప్రేక్షకుల స్పందన స్పష్టంగా చెబుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!