

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘ కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి అర్థ్యా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో రఘు బాబు, పృద్వి, ప్రభావతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ ఈ చిత్రంలో ప్రేమ, సస్పెన్స్, కామెడీ అంశాలను గ్రామీణ నేపథ్యంతో మేళవించినట్లు తెలిపారు. ఆకాష్ – భైరవి అర్థ్యా జంట బావ – మరదలుగా నటిస్తున్నారని వెల్లడించారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఫస్ట్ లుక్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!