

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా కనిపించనున్న రణ్‌బీర్ కపూర్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిన్నప్పటి నుంచి తన మనసులో ఉన్న శ్రీరాముడి రూపం, అమాయకత్వం రణ్‌బీర్‌లో కనిపించాయని, ఆయనను ఆ పాత్రలో చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపించిందని సాయి పల్లవి తెలిపారు. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రణ్‌బీర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన బీహైండ్ ది సీన్స్ వీడియోలో ఆయన పాత్ర కోసం చేసిన శారీరక మార్పు, కత్తిసాము, విలువిద్య, యాక్షన్ శిక్షణకు సంబంధించిన దృశ్యాలు చూపించారు. హాలీవుడ్ స్టంట్ నిపుణుడు టెర్రీ నోటరీ ఆధ్వర్యంలో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ పొందినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!