

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ నిరసనల మధ్య ఎవరూ ఊహించని ఓ రియల్ లైఫ్ ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనల్లో పాల్గొన్న బీహార్‌కు చెందిన మోహన్ శ్రీవాస్తవ, అదే సమయంలో నీట్ పరీక్ష రాసిన ఢిల్లీకి చెందిన ఓ యువతితో పరిచయం అయ్యాడు. ఉద్యమాలు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రారంభమైన ఈ పరిచయం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
మోహన్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువతి ప్రతిరోజూ అతనికి ఆహారం తీసుకువచ్చేది. ఒకరోజు సరదాగా "తినడానికి మాత్రమే ఇస్తావా... తాగడానికి నీళ్లు ఇవ్వవా?" అని అడగగా, మరుసటి రోజు ఆమె పెద్ద వాటర్ బాటిల్ తీసుకొచ్చింది. ఆ చిన్న సంఘటనతో ప్రారంభమైన సంభాషణలు క్రమంగా స్నేహంగా, అనంతరం ప్రేమగా మారాయి. చివరకు ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటై, నిరసనల మధ్య మొదలైన వారి ప్రేమకథను నిజ జీవితంలోని అరుదైన సంఘటనగా నిలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!