

హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లో ఉదయ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన కుటుంబ వినోదం సఃకుటుంబానాం 2026 లో తొలి హిట్గా నిలిచింది. రాజేంద్ర ప్రసాద్, రామ్ కిరణ్, మేఘ ఆకాశ్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు, మధు దాసరి డీఎప్, శశాంక్ మలి ఎడిటింగ్ చేశారు. జనవరి 1వ తేదీన విడుదలైన సినిమా వేలాది గ్రామాల్లో సందడి పుట్టించి, కొత్త సంవత్సరంలో మంచి ప్రారంభాన్ని అందించింది.
సక్సెస్ మీట్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, అభిమానులు కుటుంబ సభ్యులతో సినిమా ఆస్వాదిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు ఉదయ్ శర్మ, నిర్మాత మహదేవ్ గౌడ్ మీడియా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. హీరో రామ్ కిరణ్ మరియు నటి నవీన్ జివి కూడా ప్రేక్షకుల మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు పెద్ద తెరపై ఈ కుటుంబ వినోదాన్ని ఆస్వాదించాలని చిత్రబృందం కోరింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!