
జనరల్

నటి రియా చక్రవర్తి సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం ప్రకటించింది. నిరంతరం వస్తున్న ఆన్లైన్ ఒత్తిడి, సోషల్ మీడియా హడావిడి తన మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తున్నాయని ఆమె వెల్లడించింది. ఎండ్లెస్ స్క్రోలింగ్‌కు దూరంగా ఉండి నిజ జీవితంలోని క్షణాలను ఆస్వాదించాలని భావిస్తున్నట్లు భావోద్వేగ నోట్లో పేర్కొంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత తీవ్ర మీడియా దృష్టిని ఎదుర్కొన్న రియా, గత కొన్నేళ్లుగా సెలెక్టివ్ ప్రాజెక్ట్స్‌తో నెమ్మదిగా తన జీవితాన్ని తిరిగి నిర్మించుకుంటోంది. ప్రస్తుతం హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఫ్యామిలీ బిజినెస్ ద్వారా పెద్ద కంబ్యాక్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల ఆమె బ్యాంక్ అకౌంట్లపై ఉన్న ఫ్రీజ్ను కోర్టు తొలగిస్తూ ఉపశమనం కల్పించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!