

ఇరుముడి’ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగారావు డిమాండ్ చేశారు. సినిమా సమాజంపై ప్రభావం చూపే శక్తిమంతమైన మాధ్యమమని, తెరపై ఒక పాత్రను ఏ విధంగా చూపిస్తే అదే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల అంశాలను తెరకెక్కించేటప్పుడు దర్శకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.
‘ఇరుముడి’లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని పాత్రను అత్యంత ప్రతికూలంగా చిత్రీకరించారని వారు ఆరోపించారు. సినిమాలో కనిపించే పాఠశాల ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు జిల్లా పరిషత్ పాఠశాలను పోలి ఉందని, అక్కడి విద్యార్థుల యూనిఫామ్ కూడా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో వినియోగిస్తున్న యూనిఫామ్‌నే పోలి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని, సంబంధిత సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!