

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ‘ఫీజుల బకాయి-బీజేపీ లడాయి’ పేరుతో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష ప్రారంభమైంది. తొలుత దోమల్‌గూడలోని ధర్నాచౌక్‌లో దీక్ష చేపట్టాలని భావించినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యార్థులు, న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.
రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేల కోట్ల మేర ఫీజు బకాయిలు ఉన్నాయని రామచందర్‌రావు ఆరోపించారు. బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చెల్లింపులు నిలిచిపోవడంతో ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!