

డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్ (48) తన అందంపై వస్తున్న అనవసర వ్యాఖ్యలు, సలహాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం ఓ ప్లాస్టిక్ సర్జన్ తన ముక్కుపై ఉన్న చిన్న మచ్చను సరిచేయించుకోవాలని సూచిస్తూ సందేశం పంపినట్లు ఆమె సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. గత కొన్నేళ్లుగా తన పళ్లు, జుట్టు, ముక్కు, బొటాక్స్ వంటి అంశాలపై ఎన్నో వ్యాఖ్యలు, సలహాలు అందుతున్నాయని ఆమె తెలిపారు.
తన శరీరం, రూపం విషయంలో తాను సంతోషంగానే ఉన్నానని ఫ్రెడరిక్సన్ స్పష్టం చేశారు. తన అందంపై పురుష ప్లాస్టిక్ సర్జన్ అభిప్రాయాలు తనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. తన గురించి ఎవరైనా రాయాలనుకుంటే, ముక్కు లేదా రూపం గురించి కాకుండా మరింత అర్థవంతమైన అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. అనవసర సౌందర్య సలహాలు తనకు ఆగ్రహం కలిగిస్తున్నాయని పేర్కొంటూ, ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న వారికి తన మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!