
రాజకీయాలు

విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘కిల్లర్’ చిత్రానికి విడుదల తేదీ ఖరారైంది. చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం.. ప్రాణాలతో బయటపడేందుకు జరిగే ఉత్కంఠభరితమైన పోరాటాన్ని ప్రధానంగా చూపించనుంది.
‘కిల్లర్’ సినిమాకు పూర్వాజ్ రచన, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సర్వైవల్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠను పంచేలా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా విడుదల తేదీ ప్రకటనతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!