
సినిమాలు

మలయాళంలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మలయాళంలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లోకి డబ్ చేసి సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
తెలుగు, తమిళ వెర్షన్ల ద్వారా ఈ కుటుంబ కథా చిత్రానికి మరింత విస్తృతమైన ప్రేక్షక వర్గం చేరువ కానుంది. మలయాళంలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో డబ్బింగ్ వెర్షన్లపై కూడా ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 4న రెండు భాషల్లో ఒకేసారి థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!