

తిరు వీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఓ..! సుకుమారి’ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూళి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ ధర్షన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, తొలి పాట ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఈ చిత్రానికి సీహెచ్ కుషేందర్ సినిమాటోగ్రఫీ అందించగా, భరత్ మంచిరాజు సంగీతం సమకూర్చారు. ‘బలగం’ చిత్రంతో గుర్తింపు పొందిన తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్, అను రెడ్డి అక్కటి కాస్ట్యూమ్ డిజైనింగ్, పూర్ణాచారి సాహిత్యం అందించారు. మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్, ఝాన్సీ, అమనీ, ఆనంద్‌కోట జయరామ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విడుదలకు ముందు భారీ ప్రమోషన్లు నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!