

వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండకు ఇప్పుడు విడుదల తేదీల విషయంలో కొత్త సవాలు ఎదురైనట్లు సమాచారం. ఆయన నటిస్తున్న రణబాలి, రౌడీ జనార్ధన చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. మొదటి ప్రణాళిక ప్రకారం రణబాలి చిత్రాన్ని సెప్టెంబర్‌లో, రౌడీ జనార్ధనను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించారు. అయితే రణబాలి చిత్రీకరణ ఆలస్యం కావడంతో విడుదల షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
అక్టోబర్ దసరా సీజన్ ఇప్పటికే భారీ చిత్రాలతో నిండిపోవడంతో రణబాలిని నవంబర్ లేదా డిసెంబర్‌కు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రౌడీ జనార్ధన విడుదలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ రెండు సినిమాల మధ్య తగిన విరామం ఉండేలా నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే రౌడీ జనార్ధనను వచ్చే ఏడాదికి వాయిదా వేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రణబాలిలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ జనార్ధనలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా కనిపించనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!