

కుటుంబ ప్రేక్షకులను, ఓవర్సీస్ ఆడియన్స్‌ను తన కథలతో ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి వార్తల్లో నిలిచారు. ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కించిన ‘కుబేర’ విజయానంతరం ఆయన కొత్త కథపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది పాటు కసరత్తు చేసి సిద్ధం చేసిన ఈ స్క్రిప్ట్‌పై దర్శకుడు పూర్తి నమ్మకంతో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏషియన్ సునీల్ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కడం ఖాయమైందని సమాచారం ఉన్నప్పటికీ, హీరో ఎంపిక మాత్రం ఇంకా పూర్తికాలేదు.
ప్రస్తుతం అగ్ర హీరోలు, యువ కథానాయకులు తమ తమ చిత్రాలతో బిజీగా ఉండటంతో సరైన తేదీల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పలువురు హీరోలకు కథ వినిపించే ప్రయత్నాల్లో శేఖర్ కమ్ముల ఉన్నట్లు సమాచారం. అవసరమైతే ఇతర భాషల నటులను కూడా సంప్రదించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తన సినిమాల విషయంలో ఎలాంటి రాజీ పడని దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆయన, ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే వరకు సమయం తీసుకుంటారని పరిశ్రమలో పేరుంది. ఈసారి ఆయన కథకు ఏ హీరో సరిపోతారన్నది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!