

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మిస్తుండగా, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాను జూలై 24న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే ఇదే సమయంలో మరో భారీ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారింది.
దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ కూడా అదే తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించడంతో పరిస్థితి మారిపోయింది. విజయ్ చివరి చిత్రం కావడం, తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటంతో ఆ ప్రభావం ఇతర చిత్రాలపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళ మార్కెట్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’కి ఇది కఠిన పరీక్షగా మారే అవకాశముంది. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో తమ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో మేకర్స్ వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు. మరి ఈ పోటీలో కిరణ్ అబ్బవరం చిత్రం ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!