

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించింది. ‘వీర సింహారెడ్డి’ విజయానంతరం ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడం విశేషం. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా తాజాగా చిత్రీకరణ దశలోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో రాత్రి వేళల్లో కీలక యాక్షన్ సన్నివేశాలు మరియు టాకీ భాగాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ నైట్ షెడ్యూల్ దాదాపు రెండు వారాల పాటు కొనసాగనుంది. ముంబయి నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు జోడీగా నయనతార నటించనుండగా, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!