

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించి సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. తాత్కాలికంగా #ఏఏ23 గా పేరు పెట్టిన ఈ చిత్రం, ప్రకటనా గ్లింప్స్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. శక్తివంతమైన విజువల్స్‌కు అనిరుధ్ రవిచందర్ అందించిన ఉత్కంఠభరితమైన సంగీతం తోడవడంతో విపరీతమైన స్పందన వచ్చింది. ఈ థీమ్ మ్యూజిక్‌తో ఇప్పటికే 3 లక్షల 55 వేలకుపైగా రీల్స్ రూపొంది, సినిమా ప్రకటనలలో సరికొత్త రికార్డు నెలకొల్పింది.
డిజిటల్ యుగంలో తొలి అడుగులోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కీలకం కాగా, #ఏఏ23 ఆ విషయంలో పూర్తిగా విజయం సాధించింది. లోకేష్ కనగరాజ్ కలల ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ఇరుంబుకై మాయావి ఆధారంగా రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ శక్తివంతమైన కాంబినేషన్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!