
రాజకీయాలు

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ సొంతం చేసుకుంది. గోండు తెగకు చెందిన గిరిజన మహిళగా రష్మిక కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆమె ఫెరోషియస్ లుక్‌తో ఆకట్టుకోవడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రష్మిక నక్సలైట్ పాత్రలో కూడా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. వ్యవస్థపై పోరాడే శక్తివంతమైన గిరిజన మహిళగా ఆమె పాత్ర సాగనుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది మరియు పాన్ ఇండియా లెవల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!