

రెండు రోజులపాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును ఫలప్రదంగా, ఫలితాల ఆధారితంగా మార్చేందుకు సహకరించిన కూటమి సభ్య దేశాల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సోషల్ మీడియాలో సదస్సుకు సంబంధించిన కీలక ఘట్టాలను ప్రతిబింబించే వీడియోను ఆయన పంచుకున్నారు. సమావేశం విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేసిన మోదీ, బ్రిక్స్ వేదిక ద్వారా భారత్ అన్ని రంగాల్లో స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సహా ఇతర దేశాల నేతలు బ్రిక్స్ సదస్సును ముగించుకుని తమ స్వదేశాలకు పయనమయ్యారు. ఏడేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ వచ్చిన జిన్‌పింగ్, అధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన భారీ ప్రతినిధి బృందంతో శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, చైనా మధ్య వాణిజ్య లోటును తగ్గించడం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడం సహా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. పుతిన్ శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!