

సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేటర్లలో మంచి స్పందన అందుకున్న విషయం తెలిసిందే. సూర్య కెరీర్‌లో మరో విజయవంతమైన చిత్రంగా నిలిచిన ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఓటిటి విడుదల తర్వాత కొన్ని సాంకేతిక లోపాలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా సూర్య టైటిల్ కార్డును సరిగ్గా ప్రదర్శించకపోవడం, సెకండాఫ్‌లోని ఓ సన్నివేశంలో విజువల్స్ సరిగా కనిపించకపోవడంతో నెట్ ఫ్లిక్స్‌పై విమర్శలు వచ్చాయి.
అయితే ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న నెట్ ఫ్లిక్స్ తాజాగా ఈ లోపాలను సరిచేసింది. సూర్య టైటిల్ కార్డుతో పాటు సెకండాఫ్‌లోని సన్నివేశానికి సంబంధించిన విజువల్స్‌ను కూడా సరిచేసి కొత్త ప్రింట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 13 నుంచి ఈ అప్డేట్ చేసిన వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఇకపై సినిమాను చూసే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!