

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తన ‘దాయరా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పృథ్వీరాజ్ ‘వారణాసి’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘వారణాసి’ కేవలం సాధారణ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమా కాదని, ఇందులో ఊహించని ఎన్నో విభిన్న అంశాలు ఉన్నాయని పృథ్వీరాజ్ తెలిపారు. రాజమౌళి వంటి గొప్ప దర్శకుడు ఇంత భారీ స్థాయిలో విజువల్ వండర్‌ను తెరకెక్కిస్తుండగా, షూటింగ్ సెట్‌లో ప్రత్యక్షంగా ఉండి ఆ మ్యాజిక్‌ను చూడటం అద్భుతమైన అనుభవమని ప్రశంసించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్ చివరి దశకు చేరుకుందని పృథ్వీరాజ్ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!