

అల్లు అర్జున్ మైల్‌స్టోన్ చిత్రం ‘ఏఏ24’పై కొంతకాలంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు, ఎలాంటి కథతో తెరకెక్కనుంది అనే విషయాలపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్, స్టార్ కో-రైటర్ అరుణ్ అనిరుధన్‌కు సంబంధించిన ఓ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘మిన్నల్ మురళి’తో గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్‌తో కలిసి పనిచేసిన అరుణ్ అనిరుధన్, అల్లు అర్జున్‌కు చెందిన రేంజ్ రోవర్ ‘బీస్ట్’ వద్ద దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. ఈ ఫొటోతో అభిమానులు ఇద్దరి మధ్య కొత్త ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రాబోతుందనే వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాసిల్ రైటింగ్ టీమ్‌కు చెందిన అరుణ్ అనిరుధన్ బన్నీ ప్రాంగణంలో కనిపించడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టుగా భావిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. బాసిల్ జోసెఫ్ నేరేషన్, అరుణ్ అనిరుధన్ కథ, అల్లు అర్జున్ మాస్ అండ్ స్టైలిష్ ఇమేజ్ కలిస్తే సినిమా భారీ స్థాయిలో ఉండొచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!