

గతేడాది వరుస విజయాలతో మంచి గుర్తింపు సంపాదించిన కథానాయిక రష్మిక మందన్న, ఈ ఏడాది కూడా బలమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పలు భాషల్లో నటిస్తూ తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్న ఆమె, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో సిద్ధమవుతోంది.
బాలీవుడ్లో రూపొందుతున్న కాక్టెయిల్ 2 లో రష్మిక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కృతి సనన్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు హోమి అదజానియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ‘షూటింగ్ విజయవంతంగా ముగిసింది. నా అద్భుతమైన నటీనటులు, బృందానికి ధన్యవాదాలు. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ చిత్రం కొత్త ప్రేమకథగా రూపొందుతూ, ఈ ఏడాది ద్వితీయార్థంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశముందని సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!