

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా ‘లవ్ అండ్ వార్’లో నటిస్తున్నారు. ఇందులో ఆలియా భట్, విక్కీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రణ్‌బీర్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. భన్సాలీ సినిమాల్లో కనిపించే గ్రాండ్ విజువల్స్, రిచ్‌నెస్ ఈ చిత్రంలోనూ ఉండనున్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.
రణ్‌బీర్ చివరిగా 2023లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’లోనూ ఆయన నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి సీత పాత్రలో కనిపించనున్నారు. ‘రామాయణ’ తొలి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుండగా, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి తీసుకురానున్నారు. దీంతో ఏడాది వ్యవధిలో రణ్‌బీర్ నుంచి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!