

పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా దంపతుల విడాకుల వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని పూర్తిగా వ్యక్తిగత అంశంగా పరిగణించాలని వైఎస్సార్‌సీపీ తమ పార్టీ శ్రేణులకు సూచించింది. దీనికి సంబంధించి నాలుగు మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలను జారీ చేసింది.
పార్టీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు, ప్రకటనలు చేయకూడదు. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై జరిగే చర్చలు, స్పందనలకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే దీనికి సంబంధించిన పోస్టులు, ఇతర కంటెంట్‌ను షేర్ చేయకూడదని స్పష్టం చేసింది. ప్రజాజీవితంలో గౌరవప్రదంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!