

లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (ఆర్కేఎఫ్ఐ) నకిలీ కాస్టింగ్ కాల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సండియార్’ సెట్స్‌పైకి వెళ్లిన మరుసటి రోజే నిర్మాణ సంస్థ ఈ కీలక ప్రకటన విడుదల చేసింది. తమ సినిమాల కోసం ఎలాంటి కాస్టింగ్ ఏజెంట్లను నియమించలేదని స్పష్టం చేస్తూ, సంస్థ పేరును అక్రమంగా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ మేరకు నిర్మాణ సంస్థ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటనను విడుదల చేసింది. "రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తమ చిత్రాల కోసం ఎలాంటి కాస్టింగ్ ఏజెంట్లను నియమించలేదని స్పష్టం చేస్తున్నాం. నటనలో అవకాశాల పేరుతో మీకు వచ్చే ఈమెయిళ్లు, మేసేజ్‌లు, సోషల్ మీడియా పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. ఎవరైనా అనుమతి లేకుండా రాజ్ కమల్ ఫిల్మ్స్ పేరును ఉపయోగిస్తే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేసింది. గత ఏడాది కూడా నకిలీ కాస్టింగ్ కాల్స్‌పై నిర్మాణ సంస్థ రెండుసార్లు ప్రజలను హెచ్చరించింది. ముఖ్యంగా గత ఏడాది నవంబర్‌లో కూడా ఇలాంటి ఒక ప్రకటననే సంస్థ జారీ చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!