
ఓటీటీ

బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు 3 శాతానికి పైగా పెరగడంతో భారత మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి పెరగడంతో పాటు ఉత్పత్తి వ్యయాలు పెరిగే అవకాశముంది. దీంతో రేపు దేశీయ మార్కెట్లు ఒత్తిడితో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
చమురు ధరలు ఎక్కువ కాలం ఇదే స్థాయిలో కొనసాగితే దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విమానయాన, పెయింట్స్, రసాయనాల రంగాలపై ముడిసరుకు, ఇంధన వ్యయాల పెరుగుదల ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. చమురు ధరలు ఎంతకాలం అధిక స్థాయిలో కొనసాగుతాయన్న అంశం మార్కెట్ పరిస్థితులు, కంపెనీల లాభాలపై కీలక ప్రభావం చూపనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!