
జనరల్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణం పార్ట్-1' ట్రైలర్‌ను దర్శకుడు నితేష్ తివారి చిత్రబృందం విడుదల చేసింది. 4 నిమిషాల 9 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో ఆకట్టుకోగా, సాయి పల్లవి సీతగా మెప్పించారు. యశ్ రావణుడి పాత్రలో తన పవర్‌ఫుల్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రధాన బలంగా మారింది. సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.














కామెంట్స్ (1)
Excellent..!! eagerly waiting for the movie..Jai Shree Ram 🚩