

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో, దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ టీజర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనుమతి లభించింది. దాదాపు మూడు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ‘రామ’ పేరుతో రాబోయే ఈ టీజర్‌కు గ్రీన్ సిగ్నల్ రావడంతో వచ్చే నెల 2న విడుదలకు మార్గం సుగమమైంది.
ఈ టీజర్ నిడివి 2 నిమిషాల 38 సెకన్లుగా ఉండనుందని సమాచారం. దీనికి యూనివర్సల్ రేటింగ్ ఇవ్వబడింది, అందువల్ల అన్ని వయసుల వారు ఈ టీజర్‌ను థియేటర్లలో వీక్షించవచ్చు. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పటివరకు చిత్రబృందం టైటిల్ వీడియోతో పాటు మూడు నిమిషాల ‘రామాయణ: ది ఇంట్రడక్షన్’ క్లిప్‌ను మాత్రమే విడుదల చేసింది. అందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ లుక్స్ చూపించారు. ఇప్పుడు రాబోయే టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.















.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!