
జనరల్

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ‘RAPO-23’ పేరుతో రూపొందనున్న తన 23వ చిత్రానికి ఆయన దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇటీవల వచ్చిన చిత్రాల తర్వాత కొత్త ప్రయోగానికి సిద్ధమైన రామ్, ఈ ప్రాజెక్ట్ ద్వారా మెగాఫోన్ కూడా పట్టబోతుండటం విశేషం.
ఈ సందర్భంగా మాట్లాడిన రామ్, కెరీర్‌లో రిస్క్ తీసుకోవడానికి తాను ఎప్పుడూ వెనుకాడలేదని తెలిపారు. దాదాపు 20 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేయడం సహజమైన పరిణామమని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను కూడా ఆయనే అందిస్తుండగా, హీరోగా కూడా నటించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!