
ఓటీటీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ద’ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తైనట్లు సమాచారం. అయితే సినిమాలోని కొన్ని పదాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘చికిరి’ పాటలోని “సరుకు సామాన్” పదాన్ని మార్చాలని సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!