
జనరల్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ అధికారులు యూఏ సర్టిఫికేట్ జారీ చేశారు. సుమారు 3 గంటల 2 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ‘పెద్ది’పై భారీ హైప్ నెలకొంది. బోర్ కొట్టకుండా గూస్బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్, పవర్ఫుల్ ఎమోషన్స్, మాస్ ఎలివేషన్స్ సినిమాకు ప్రధాన బలమని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్స్‌తో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!