

RRRతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌కు శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ నిరాశ కలిగించడంతో, ఈసారి కొత్త దర్శకుడు బుచ్చిబాబుతో పెద్ది ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టాడు. మొదట్లో అనుమానాలు ఉన్నప్పటికీ, గ్లింప్స్ మరియు “చికిరి”, “రైరైరారా” పాటలు విడుదలయ్యాక సినిమా పై అంచనాలు గణనీయంగా పెరిగాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం మరోసారి మ్యాజిక్ సృష్టిస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
మొదట మార్చి 27న రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యం మరియు మ్యూజిక్ పనులు పూర్తి కాకపోవడంతో ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, ఆయేషా ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్, నార్త్ బెల్ట్‌లో పెద్దగా పోటీ లేకపోయినా, అదే రోజున తమిళంలో ధనుష్ సినిమా, కన్నడలో KD – ది డెవిల్ రిలీజ్ అవ్వడం, అలాగే మలయాళంలో ముందుగా వచ్చే పేట్రియట్ ప్రభావం చూపే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!