
క్రీడలు

పెద్ది సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్‌తో తన 17వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న వేళ, చరణ్ సినీ రంగానికి మించి మరో కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తాజా సమాచారం ప్రకారం ఆయన మల్టీప్లెక్స్ రంగంలోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి టాలీవుడ్ స్టార్లు మల్టీప్లెక్స్ వ్యాపారంలో విజయవంతంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే దారిలో అడుగులు వేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ 2027లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!