

తాజా ఇంటర్వ్యూలో స్పైడర్ సినిమా పరాజయం తనను వ్యక్తిగతంగా ఎంతగా ప్రభావితం చేసిందో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. మహేష్ బాబుతో, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో పని చేసే అవకాశం రావడంతో ఆ సమయంలో తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని గుర్తుచేసుకుంది. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా విఫలమవడం, ముఖ్యంగా రెండో భాగంపై వచ్చిన ట్రోలింగ్ తనను కాస్త కలచివేసిందని చెప్పింది.
సినిమా సైన్ చేసినప్పుడు చాలా ఆశలతో ఉన్నానని, ఫలితం వచ్చిన తర్వాత కొంత నిరాశకు గురయ్యానని రకుల్ తెలిపింది. అయితే కాలక్రమేణా, కొన్ని విషయాలు నటుల చేతుల్లో ఉండవని గ్రహించానని కూడా చెప్పింది. స్పైడర్ ను తన వ్యక్తిగత పరాజయంగా ఎప్పుడూ భావించకపోయినా, సినిమా ఫలితం తనపై ప్రభావం చూపిందని అంగీకరించింది. వైఫల్యాలు కూడా ప్రయాణంలో భాగమేనని అది తనకు నేర్పిందని చెప్పింది.
తాను విచారపడే మనిషి కాదని, వైఫల్యం మనిషిని మరింత బలంగా, జాగ్రత్తగా మారుస్తుందని రకుల్ అభిప్రాయపడింది. ముందుకు ఎలా మెరుగుపడాలో మాత్రమే ఆలోచించానని చెప్పింది. విజయం మన చేతుల్లో ఉండదని, కానీ మన శ్రమ మాత్రం మనదేనని స్పష్టం చేసింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, నేను నా కోసం సెలబ్రేట్ చేసుకుంటానని రకుల్ చెప్పింది. ప్రస్తుతం ఆమె పతి పత్నీ ఔర్ వో దో సినిమాలో కనిపించనుంది.










.avif&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!