

రజినీకాంత్, కమల్ హాసన్ కలయికలో రూపొందనున్న ‘ధర్మన్’ ప్రకటన వచ్చిన నాటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి పలువురు దర్శకుల పేర్లు వినిపించడం, ప్రాజెక్ట్ పదేపదే మార్పులు చవిచూడటం వంటి అంశాలు అనేక సందేహాలకు కారణమయ్యాయి. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో రజినీకాంత్ స్వయంగా ఈ విషయాలపై స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు. దీంతో చాలా కాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది.
రజినీకాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం మొదట దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌తో చర్చలు జరిగినప్పటికీ, కథ విషయంలో పూర్తిస్థాయి అంగీకారం కుదరకపోవడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయిందట. అనంతరం సుందర్ సి ఈ ప్రాజెక్ట్‌ను పరిశీలించినా ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ముందుకు సాగలేకపోయారని తెలిపారు. ఆ తర్వాత శిబి చక్రవర్తి సిద్ధం చేసిన కథ అందరికీ నచ్చినప్పటికీ, విదేశాల్లో చిత్రీకరణ అవసరం కావడం, భారీ ఖర్చులు పెరగడం, కొన్ని సున్నిత అంశాలు ఉండటంతో తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. చివరకు అశ్వత్ మారిముత్తు చెప్పిన కథపై అందరూ ఏకాభిప్రాయానికి రావడంతో అదే కథను ‘ధర్మన్’గా రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!